Nagarjuna Next Movie | ది ఘోస్ట్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత నాగ్ నుంచి ఇప్పటి వరకు కొత్త సినిమా కబురు అందలేదు. అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఇప్పటికీ సరైన మోక్షం కనిపించడం లేదు. పైగా అక్కినేని హీరోలు సైతం ఏడాది గ్యాప్‌లో ఒకరిని మించి మరొకరు డిజాస్టర్లను తగిలించుకున్నారు. దాంతో కంబ్యాక్ కోసం సరైన కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇక నాగ్ తన నెక్ట్స్ సినిమాను ప్రసన్న కుమార్ బెజవాడతో చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ వార్త ఫిలింనగర్ మొత్తం చుట్టేసింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. కాగా నాగార్జున కొత్త సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా 29న అఫీషియల్‌గా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
ముందుగా అనుకున్నట్లుగా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాను తెరకెక్కించడం లేదు. ఆయన స్థానంలో నాగ్ మరో కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట. ఎన్నో సూపర్ హిట్ పాటలకు తన డ్యాన్స్‌తో ఆజ్యం పోసిన విజయ్ బన్నీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ అని కూడా తెలుస్తుంది. కాగా విజయ్ బన్నీ తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసినట్లు, కేవలం ఆ మలయాళ సినిమా కోర్ పాయింట్‌ను మాత్రమే తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇక 20ఏళ్ల క్రితం ఇలాగే నాగార్జున మాస్ సినిమాతో లారెన్స్‌ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేశాడు.
ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్టయింది. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే చానల్ మార్చకుండా ఈ సినిమానే చూస్తుంటాం. పాటలు, ఫైట్స్, డైలాగ్ ప్రతీది సమపాల్లలో కుదిరి బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ నాగ్‌తో డాన్ సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినప్పటికీ.. చాలా మందికి హాట్ ఫేవరైట్. కాగా ఇప్పుడు విజయ్ బన్నీ కూడా నాగార్జునకు మాస్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇస్తాడా లేదా చూడాలి. ఇక ఈ సినిమాకు గలాటా అనే పేరును పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. హీరోయిన్గా కాజల్ కూడా ఫిక్సయిపోయిందని తెలుస్తుంది.