మా జోలికొస్తే.. నా సామిరంగ
అగ్ర నటుడు నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
అగ్ర నటుడు నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే ఫస్ట్ టీజర్, ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయగా..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం టైటిల్సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘మా జోలికొస్తే..మాకడ్డు వస్తే మామూలుగా ఉండదు..నా సామిరంగ..ఈ గీత తొక్కితే..మా సేత సిక్కితే..మామూలుగా ఉండదు..నా సామిరంగ’ అంటూ కథానాయకుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఎం.ఎం.కీరవాణి స్వరపరచిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో దాదాపు 300 మంది డ్యాన్సర్లపై ఈ పాటను చిత్రీకరించారు. నాగార్జున మాస్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి చేసిన డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

