ప్రతి శనివారం ఇంటి సభ్యులకు క్లాసులు పీకుతూ వారిని ఎంటర్టైన్ చేస్తూవస్తున్న నాగార్జున ఈ వారం కూడా అలానే చేశాడు. ముందుగా అందరికి హాయ్ చెప్పిన ఆయన ముందుగా శ్రీరామ్‌ని పిలిచి.. బిగ్‌బాస్ టైటిల్ ఇష్టమా? హమీదా ఇష్టమా? అని సూటిగా అడిగాడు. కొద్ది సేపు ఆలోచించి బిగ్ బాస్ టైటిల్ ఇష్టం అని చెప్పాడు. శ్రీరామ్ సమాధానానికి నాగ్‌కి నవ్వు వచ్చేసింది. అనంతరం నీ కెప్టెన్సీ బాగుందని ప్రశంసలు కురిపించాడు. కాకపోతే ఎవరి వంట వారు వండుకోమని చెప్పడమే బాగోలేదని అన్నాడు.
సిరిని ప్రశ్నించిన నాగ్.. ఒకరి వెనుక మాట్లాడొద్దు అంటావ్ కదా.. మరి నువ్వు నీ అడ్డాలో కూర్చుని చేస్తున్నది ఏమిటీ అని నాగార్జున అడిగే సరికి సిరి నీళ్లు నమిలింది. మా మూగ్గురికి ఓ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి.. అలా మాట్లాడాను సార్ అంటూ కవర్ చేసుకుంది . అనంతరం సన్నీని పలకరించిన నాగార్జున.. ఆయన రాజు కాలేనందుకు బాధగా ఉందని చెప్పాడు.
‘సన్నీ నువ్వు రాజువి కాలేకపోవడం చాలా బాధనిపించిందయ్యా.. అయినా నీకు నువ్వు బాహుబలిగా ఫీల్ అయ్యావ్ కదా.. అయితే లాస్ట్ వీక్ నువ్వు చేసిన తప్పుల వల్లే ఈ ఓటమి’ అంటూ సర్ధి చెప్పారు. ఇక మిగతా కంటెస్టెంట్స్‌ని కూడా నాగ్ ప్రశ్నించాడు. పనిలో పనిగా కొండపొలం టీం ప్రమోషన్ కోసం వచ్చిన క్రిష్, వైష్ణవ్ తేజ్‌లతో కూడా ప్రశ్నలు అడిగించి కడిగించేశాడు నాగార్జున.