బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున కొన్నాళ్లుగా కళ్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రచార కార్యక్రమం కోసం వీరు పలు సార్లు కమర్షియల్ యాడ్స్‌లో నటించారు. తాజాగా మరో కొత్త యాడ్‌లో నటించారు. ఇందులో అమితాబ్, నాగార్జున, రెజీనా కాసాండ్రా తెగ సందడి చేశారు. ఇందులో నాగార్జున చెల్లెలిగా రెజీనా కనిపించగా, అమితాబ్ బచ్చన్- జయమాధురి వియ్యంకులిగా కనిపించి అలరించారు.
కమర్షియల్ యాడ్‌ని ఓ సినిమా రేంజ్లో చిత్రీకరించారు. ఈ యాడ్ కు గాను శంకర్ మహదేవన్ సంగీతాన్ని అందించాడు. శ్వేత మోహన్ తో కలిసి శంకర్ మహదేవన్ ఈ యాడ్ కోసం గొంతు విప్పాడు. కలర్ ఫుల్ అండ్ హార్ట్ టచ్చింగ్ గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అమితాబ్, నాగార్జున కలిసి గతంలో మనం చిత్రంలో నటించగా ఇప్పుడు బ్రహ్మాస్త్రా చిత్రం చేస్తున్నారు.
The auspicious beginning of a new togetherness. @Kalyanjewellers #MuhuratWeddingJewellery collection cherishes & celebrates every Indian bride. @srbachchan @ReginaCassandra @_ShwetaMohan_ @Shankar_Live pic.twitter.com/FdBoLyG13F
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 17, 2021