Nagarjuna | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులపై ఆయన వ్యక్తం చేసిన ప్రేమ, కృతజ్ఞతలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. వేదికపై మాట్లాడిన నాగార్జున, అక్కినేని అభిమానుల సహనాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు. అఖిల్‌కు ఒక బ్లాక్‌బస్టర్ రావాలని ఇన్నేళ్లు ఎంతో ఓపికగా ఎదురు చూశారు. నాగచైతన్యకు ‘తండేల్’ లాంటి విజయం రావాలని ఎలా ఎదురుచూశారో, అదే ప్రేమతో అఖిల్ కోసం కూడా నిలబడ్డారు. మీ అందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు.
నాగార్జున తన ప్రసంగంలో నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్’ చిత్రాన్ని ప్రస్తావించడం కూడా చర్చనీయాంశమైంది. అభిమానుల విశ్వాసం, సహనం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు అంటూ ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అక్కినేని అభిమానులపై ఆయన వ్యక్తం చేసిన ప్రేమ, కృతజ్ఞతలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.
‘ఏజెంట్’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకున్న అఖిల్, ఈసారి కథ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు చెప్పిన ‘లెనిన్’ కథను ఎంచుకున్నారు. సినిమా కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్, నటనలో కూడా మార్పులు తీసుకువచ్చారు. ఆ కృషికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక అక్కినేని అభిమానులు కూడా మొదటి రోజు నుంచే సినిమాకు బలమైన మద్దతు అందించారు. అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల వద్ద కనిపించిన సందడి, సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూస్తుంటే అఖిల్‌కు చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ సక్సెస్ దక్కినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎమోషన్స్‌తో పాటు ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా అఖిల్ నటనలో వచ్చిన పరిణతి ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.