అగ్ర హీరో అక్కినేని నాగార్జున 100వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్టోబర్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. హైదరాబాద్, మైసూర్లో కొంతభాగం చిత్రీకరణ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ‘బిగ్బాస్’కోసం నాగ్ బ్రేక్ ఇచ్చారని తెలిసింది. ఆ సినిమా కోసం దర్శకుడు రా కార్తీక్ అద్భుతమైన కథను సిద్ధం చేశారనేది ఫిల్మ్ వర్గాల టాక్. త్వరలోనే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కానున్నది.
2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారట. నాగార్జున హీరోగా రూపొందుతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. నేషనల్ లెవల్ ఆడియన్స్ని మెప్పించే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. లాటరీ కింగ్, కింగ్ 100, 100 నాట్ అవుట్ అనే మూడు టైటిల్స్ ఈ సినిమా కోసం అనుకుంటున్నారు. ఇంకా ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది.