బిగ్ బాస్ హౌజ్లొకి వచ్చాక నాగార్జున అతనితో చెడుగుడు ఆడుకుంటున్నాడు.చాన్స్ దొరికినప్పుడల్లా ఆయనపై ఫుల్ ఫైర్ అవుతున్నాడు. కన్నింగ్, గుంటనక్క, మోసగాడు, ఇతరుల ఆటను ప్రభావితం చేసే వ్యక్తి అంటూ దోషిలా నిలుచోబెడుతున్నాడు. రీసెంట్గా రవి.. సిరి, షణ్ముఖ్లతో ఫ్యామిలీ సిక్నెస్ పంచుకున్నాడు.తన భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందని అన్నాడు.
బిగ్ బాస్ వాళ్లు ఎలా ఉన్నారో చెప్పాలని, లేదా తననైనా బయటకు పంపాలని రవి కోరాడు. అయితే ఇదే విషయంపై నాగార్జున రవికి గట్టి క్లాస్ పీకారు.‘ఏంటి రవీ నీ ప్రాబ్లమ్.. బాగా స్లో అయ్యావ్ అంటూ వీడియో చూపించి క్లాస్ పీకాడు.ఆ వీడియో చూశాక..ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుగా ఉందని అన్నాడు. దీనికి నాగ్.. అందరికి ఫ్యామిలీ ఉంది కదా, నువ్ ఈ గేమ్ గురించి అన్నీ తెలుసుకునే ఒప్పుకుని వచ్చావు.. నిన్ను ఎవరొచ్చి అడిగారు.. వెళ్లాలంటే వెళ్లిపో.. డబ్బు కోసం రాలేదని అంటున్నావ్..
నీకు కావాలంటే వెళ్లిపోవచ్చు.. పోతావా?? గేట్లు ఓపెన్ చేయిస్తా.. వెళ్లిపోతానంటే వెళ్లిపోవచ్చు ఇప్పుడే గేట్లు ఓపెన్ చేయిస్తా’ అంటూ గట్టిగా మాట్లాడారు నాగార్జున.దీనికి రవి నీళ్లు నములుతూ ఏదో చెప్పుకొచ్చాడు. ఏదేమైన రవిని ఊరికే టార్గెట్ చేయడం పట్ల ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.