Naga Shourya | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు నాగశౌర్య. వైవిధ భరిత పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఛలో’ విజయం తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తీగా మారిపోయింది. ఒకే జానర్లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.
లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదల కావాల్సిఉంది. కానీ కొన్ని కారణాలు వాయిదాపడింది. షిర్లీ సేథియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఇదివరకే విడుదలైన వర్షంలో వెన్నెల పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.