కదనానికి కార్తిక్ సిద్ధం
నాగశౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్'. రామ్ దేశిన(రమేష్) దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.
నాగశౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’. రామ్ దేశిన(రమేష్) దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకూ, పాటలకూ మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఒక చేతితో ఆయుధం పట్టుకొని, మరో చేతిని పైకెత్తి పిడికిలి బిగించి, కదనానికి సిద్ధమంటున్నట్టుగా ఉద్రేకంగా నిలబడి చూస్తున్న నాగశౌర్యను పోస్టర్లో చూడొచ్చు. ఆయన నేపథ్యంలో మహాకాళి విగ్రహం, జాతర వాతావరణం కనిపిస్తున్నది. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకున్నది. విధి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ వీకే, శ్రీదేవి విజయకుమార్, సముద్రఖని కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, నిర్మాణం: శ్రీవైష్ణవి ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

