Naga Manikanta Eliminate | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. తనకు తానే నేను హౌజ్ నుంచి వెళ్లిపోతాను నన్ను బయటకు పంపేయండి నాగార్జున గారు అంటూ వేడుకోగా తనను సెల్ఫ్ ఎలిమినేషన్ కిందా హౌజ్ నుంచి బయటకు పంపేశాడు నాగార్జున. బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడు ఈ సీజన్ టైటిల్ పక్కా గెలవాలి అప్పుడే నా భార్య, నా కూతురు నాకు దక్కుతారు. నా అత్తమామల దగ్గర గౌరవం దక్కుతుందంటూ అందరిని ఎమోషనల్ చేశాడు నాగ మణికంఠ. అయితే హౌజ్ వచ్చిన దగ్గరినుంచి ప్రతిసారి ఓవర్ ఎమోషనల్ అవ్వడం లాంటివి చేయడం వలన ప్రేక్షకులకు కూడా అతడి ఆట చూడడానికి ఆసక్తి చూపించలేదు. ఇక ఏడో వారం నామినేషన్స్‌లో మణికంఠతో పాటు, గౌతమ్‌లు ఉండగా.. నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ మణికంఠ వేడుకున్నాడు. అయితే ఈ విషయంలో నాగార్జున మళ్లీ ఆలోచించుకో అని అవకాశం ఇచ్చారు. అయితే మణికంఠ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడి కోరిక మేరకు బిగ్‌బాస్ సీజన్-8 నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక మణికంఠ ఎలిమినేట్ అయిన అనంతరం ప్రేక్షకులు వేసిన ఓట్ల వివరాలను నాగార్జున వెల్లడించాడు. ఇందులో మణికంఠకు ఎక్కువ ఓట్లు పడగా.. గౌతమ్‌కు తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, మణికంఠ తనని తాను ఎలిమినేట్ చేయమని కోరడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపారు. ఇదిలావుంటే మణికంఠ ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. తనని మళ్లీ హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇప్పించడానికి బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.