Vrushakarma | తండేల్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma) . విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోండగా.. ‘లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు.
కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఓ గుహలో చైతూ నడుముకు బెల్ట్, చేతిలో ఆయుధాన్ని పట్టుకుని కనిపించడం చూడొచ్చు. గ్లింప్స్‌తో వృషకర్మ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సూపర్ ఎక్జయిట్ చేసే అవుట్‌పుట్ మీ కోసం రెడీ చేసిందంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ బి.లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
We open the world of #VRUSHAKARMA with a glimpse on March 5th, 2026 .@karthikdandu86 and team have put together something super exciting . #VrushakarmaGlimpse @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava @AJANEESHB #RagulDHerian @Srinagendra_Art @NavinNooli… pic.twitter.com/tHzhsVJkew
— chaitanya akkineni (@chay_akkineni) February 25, 2026
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!