Naga chaitanya-venkat Prabhu Movie | ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు ‘థాంక్యూ’ చిత్రం బ్రేకులు వేసింది. భారీ అంచనాల నడుమ జూలై 22న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం నాగచైతన్య ఈ దర్శకుడితోనే ధూత అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌ను అమెజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని వెల్లడించారు. అంతేకాకుండా ‘ఈ చిత్రం కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, నాగచైతన్య పాత్ర కొత్తగా.. గతంలో ఎన్నడూ చేయనటువంటి రోల్లో నటిస్తున్నాడని. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మూడో వారంలో స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఇద్దరూ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.