NC22 Shooting Update | అక్కినేని నాగచైతన్య ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన రెండు సినిమాలు 6 నెలల గ్యాప్‌లోనే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కాగా చిత్రబృందం తాజాగా మైసూర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘ధూత’ వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి అమేజాన్ ఒరిజినల్స్ నిర్మిస్తుంది.
Read Also:
Chiyaan61 | విక్రమ్ మూవీ క్రేజీ అప్డేట్.. దీపావళికి టాపాసులు మోత..!
Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ప్రాజెక్ట్-K’ నుండి క్రేజీ అప్డేట్..!
The Ghost Movie | అప్పుడే ఓటీటీలోకి ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?