Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ప్రాజెక్ట్-K’ నుండి క్రేజీ అప్డేట్..!
Projeck-K Movie | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు.
Projeck-K Movie | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీహిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే షూటింగ్ స్టార్ట్ అయి నెలలు గడుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లు రాలేవు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
తాజాగా నాగ్ అశ్విన్ ‘సమ్‌థింగ్ స్మాల్ కమింగ్’ అని ట్వీట్ వేశాడు. దీనితో దీపావళికి ‘ప్రాజెక్ట్-K’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే బచ్చన్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు మేకర్స్ చేస్తున్నారు.
Something small coming tom… ✌️
— Nag Ashwin (@nagashwin7) October 22, 2022
Read Also:
RRR In Japan | జపాన్ వీధుల్లో చరణ్, తారక్ సందడి.. వీడియో వైరల్!
NBK107 | ‘వీర సింహా రెడ్డి’గా బాలకృష్ణ.. ఊరమాస్‌గా టైటిల్ పోస్టర్
The Ghost Movie | అప్పుడే ఓటీటీలోకి ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
NBK107 | బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ గోపిచంద్ మలినేని జైలుకు వెళ్ళాడా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

