NBK107 | బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ గోపిచంద్ మలినేని జైలుకు వెళ్ళాడా..!
Gopichandh Malineni | టాలీవుడ్ కమర్షియల్ దర్శకులలో గోపిచంద్ మలినేని ఒకడు. 'డాన్ శ్రీను'తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ మలినేని అనతికాలంలో అగ్ర హీరోలతో సినిమాలు చేసే చాన్స్ దక్కించుకున్నాడు.
Gopichandh Malineni | టాలీవుడ్ కమర్షియల్ దర్శకులలో గోపిచంద్ మలినేని ఒకడు. ‘డాన్ శ్రీను’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ మలినేని అనతికాలంలో అగ్ర హీరోలతో సినిమాలు చేసే చాన్స్ దక్కించుకున్నాడు. గతేడాది ‘క్రాక్’తో రవితేజకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గోపిచంద్ .. ఈ సారి బాలయ్యకు హిట్టిచ్చే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ హీరోగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘వీరసింహా రెడ్డి’. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.
గతరాత్రి ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టైటిల్‌కు నందమూరి ఫ్యాన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. కాగా టైటిల్ లాంచ్ కార్యక్రమంలో గోపిచంద్ మాట్లాడుతూ ‘సమరసింహా రెడ్డి’ రిలీజ్ డేన తను మొత్తం ఆ రోజంతా జైల్లోనే గడిపనట్లు చెప్పాడు. అంతేకాకుండా ‘ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే వీరసింహా రెడ్డి. ఈ సినిమా మన ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఉంటుందని’ వెల్లడించాడు. టైటిల్ లాంచింగ్‌లో గోపిచంద్ మాటలను నందమూరి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక గోపిచంద్ ఇప్పటికే పలు సార్లు తన బాలయ్యకు వీరాభిమానినని చెప్పిన విషయం తెలిసిందే.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలయ్యకు జోడీగా ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
The Ghost Movie | అప్పుడే ఓటీటీలోకి ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
NBK107 | బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ గోపిచంద్ మలినేని జైలుకు వెళ్ళాడా..!
NBK107 | ‘వీర సింహా రెడ్డి’గా బాలకృష్ణ.. ఊరమాస్‌గా టైటిల్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

