RRR In Japan | జపాన్ వీధుల్లో చరణ్, తారక్ సందడి.. వీడియో వైరల్!
RRR In Japan |జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ చిత్రం జపాన్‌లో విడుదలైంది. తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు.
RRR In Japan | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా, ఈ చిత్రం జపాన్‌లో విడుదలైంది. తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అక్కడికి వెళ్లారు.
ఈ సందర్భంగా జపాన్ వీధుల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా సందడి చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. గులాబీ పువ్వులు చేతిలో పట్టుకొని, ఒకరి చేతిలో మరొకరు చెయ్యి వేసుకుని ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను రామ్‌చరణ్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోకు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘దోస్తి’ పాటను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెర చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో నటించారు.
Together forever ❤️!! #rrr pic.twitter.com/1jBbzacwkk
— Ram Charan (@AlwaysRamCharan) October 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

