Dhootha 2 | నిర్మాతగా మారిన నాగచైతన్య.. నాగార్జున క్లాప్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన ‘దూత 2’
Naga Chaitanya | అక్కినేని అభిమానులకు మరియు ఓటీటీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దూత' సీక్వెల్ అధికారికంగా ప్రారంభమైంది.
Dhootha 2 Begins | అక్కినేని అభిమానులకు మరియు ఓటీటీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్ అధికారికంగా ప్రారంభమైంది. ‘దూత సీజన్ 2’ పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ క్రేజీ సీక్వెల్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ మొత్తానికి తన ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు.
ఈ సిరీస్‌తో అక్కినేని నాగచైతన్య కెరీర్లో ఒక మైల్స్టోన్ చాప్టర్ మొదలైంది. కేవలం హీరోగానే కాకుండా, ఈ ‘దూత 2’ సిరీస్ ద్వారా ఆయన నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్‌లతో కలిసి చైతన్య స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా నాగచైతన్య స్పందిస్తూ, దూత సెకండ్ చాప్టర్లో అడుగుపెట్టడం, అలాగే నిర్మాతగా తన మొదటి అడుగు పడటం చాలా సంతోషంగా ఉందని, ఇదొక శుభపరిణామమని, ఇకపై మరింత మ్యాజిక్ క్రియేట్ అవ్వబోతోందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మొదటి సీజన్‌ను మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో అద్భుతంగా తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఈ రెండో సీజన్‌ను కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి సీజన్లో కీలక పాత్రలు పోషించిన మలయాళ నటి పార్వతి తిరువోతు, తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ సీక్వెల్లోనూ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇషాన్ ఛాబ్రా సంగీతం అందిస్తుండగా, ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే పద్మాకర్, ప్రవళ్య, అనుష పుంజాల తదితరులు ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షణలో భాగస్వాములుగా ఉన్నారు.
Auspicious beginnings as I step into the second chapter of Dhootha and my first step as a producer . Onwards and upwards . Here’s to the magic ahead . #dhootha2 @Vikram_K_Kumar @AnnapurnaStdios @nseplofficial @sharrath_marar @Padmak131 @PrimeVideoIN @parvatweets @priya_Bshankar… pic.twitter.com/cReG7A4mbi
— chaitanya akkineni (@chay_akkineni) June 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

