Naga Chaitanya | టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథనాయికగా నటిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. తాజాగా తండేల్ ట్రైలర్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లిన నాగ చైతన్య సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతాడు. అయితే పాకిస్థాన్ జైలు నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఇందులోనే కొంచెం ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
Love for his country. Love for his people. Love for Satya. ❤🔥
Mark your calendars, #ThandelTrailer arrives on January 28th 💥💥#Thandel Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind @TheBunnyVas @ThandelTheMovie… pic.twitter.com/gNigSyJFiH
— Geetha Arts (@GeethaArts) January 25, 2025