Naga Chaitanya | అక్కినేని వారింట జరిగిన పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అఖిల్-జైనాబ్ల పెళ్లిని నాగార్జున ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించారు. దాంతో ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. అయితే పెళ్లైన తర్వాత నాగార్జున కొన్ని పిక్స్ షేర్ చేస్తూ నేను, అమల ఉప్పొంగే సంతోషంతో ఈ శుభవార్తని మీతో పంచుకుంటున్నాం. మా తనయుడు అఖిల్ అక్కినేని, జైనబ్ ఎంతో అందంగా జరిగిన వివాహ వేడుకతో ఒక్కటయ్యారు. మా ఇంట్లోనే ఈ వేడుక జరిగింది. అఖిల్ పెళ్లి వేడుకతో మా కల సాకారమైంది. కొత్త జంటకి మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు నాగార్జున. ఇక నాగ్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా నాగ చైతన్య కూడా అందమైన పిక్ షేర్ చేస్తూ.. నూతన వధూవరులకి అభినందనలు.. ప్రియమైన జైనబ్‌ని మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం అని రాసుకొచ్చాడు. ఈ పిక్ అక్కినేని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. పిక్ లో చైతూ తన భార్య శోభితతో ఉండగా, అఖిల్ జైనబ్‌తో ఉన్నాడు. ఇక పక్కనే నాగార్జున – అమల కూడా ఉన్నారు. ఇది పర్ఫెక్ట్ పిక్చర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు అక్కినేని దంపతులు సంప్రదాయ దుస్తులలో కనిపించడం చాలా చూడముచ్చటగా ఉందని అంటున్నారు.
ఇక గతేడాది నవంబర్ లో అఖిల్-జైనాబ్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది. అఖిల్-జైనాబ్ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు, దగ్గుబాటి ఫ్యామిలీ వచ్చి మరింత శోభని తీసుకొచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం, ఈ నెలాఖరులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.