Thandel Movie Leaked Online | అక్కినేని హీరో, నటుడు నాగ చైతన్య కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం తండేల్ (Thandel). చైతూ చివరి మూడు చిత్రాలైన, థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచాయి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో తండేల్‌లో నటించాడు నాగ చైతన్య. కార్తికేయ 1,2 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించాడు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా వచ్చి రెండు రోజులు కూడా కాకముందే ఆన్లైన్లో దర్శనమిచ్చింది. మూవీ రూల్జ్, ఫిల్మి జిల్లా వంటి పలు ఆన్లైన్ పైరసీ వెబ్సైట్లలో ఈ సినిమా హెచ్డీ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో పాటు గేమ్ ఛేంజర్, విడా ముయర్చి సినిమాలు లీక్ అవ్వగా.. తాజాగా తండేల్ కూడా లీక్ అవ్వడంతో ఈ ఎఫెక్ట్ మూవీపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా లీక్ అవ్వడంపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిత్రయూనిట్ స్పందిస్తూ.. మా సినిమాను థియేటర్లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి అంటూ చెప్పుకోచ్చింది.