Naga Chaitanya | టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో ఒకరిగా నిలిచిన అక్కినేని నాగ చైతన్య , నటి శోభితా ధూళిపాళ ప్రేమ కథ ఎప్పటికీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. దాదాపు రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఎక్కువగా పబ్లిక్ గా కనిపించని నాగ చైతన్య, తాజాగా తన భార్య గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. అత్యంత పాపులర్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లో హోస్ట్ జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు చైతూ ఓపికగా, సరదాగా స్పందించాడు. “నేను నా భార్యను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తానని అస్సలు ఊహించలేదు. ఆమె వర్క్ గురించి నాకు బాగా తెలుసు. ఓసారి నేను నా క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, ఆమె ఓ ఎమోజీతో కామెంట్ చేసింది. అప్పుడే చాట్ స్టార్ట్ అయ్యింది. తర్వాత కలుసుకున్నాం” అంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు చైతన్య.
తన భార్య గురించి చెబుతూ, “శోభితా మై వైఫ్… ఆమె నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ సపోర్ట్. ఆమె లేకుండా ఉండలేను” అంటూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక చైతూ ముందుగా సమంతని ప్రేమించి పెళ్లి చేసుకోగా, నాలుగేళ్ల తర్వాత ఆమె నుండి విడిపోయి శోభితని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం శోభితతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక సినిమాల పరంగా చూస్తే, నాగ చైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి అనౌన్స్మెంట్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2026లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశముందని సమాచారం.
వ్యక్తిగతంగా కొత్త జీవితం ప్రారంభించిన నాగ చైతన్య, ప్రొఫెషనల్‌గా కూడా మరో సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్న చైతూ అభిమానులందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాడు.