Custody Movie | మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ‘కస్టడీ’ సినిమాపై అక్కినేని అభిమానులు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. గతేడాది దసరాకు రిలీజైన ‘ది ఘోస్ట్’, లేటెస్ట్గా విడుదలైన ‘ఏజెంట్’ రెండు అక్కినేని ఫ్యాన్స్‌ను తేరుకోలేని దెబ్బ కొట్టాయి. దాంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు కస్టడీపై బోలెడు ఆశతో ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లో సినిమాపై మంచి హైప్‌నే క్రియేట్నే చేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వూలో తన క్రష్ గురించి చెప్పాడు. తాజాగా నాగచైతన్య ‘బేబీలాన్’ అనే హాలీవుడ్ సినిమా చూశానని, అందులో మార్గొట్ రాబ్బీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని చెప్పాడు. ఆమె నటనకు, ఆమెకు పడిపోయాని తెలిపాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు.