Saipallavi | లవ్‌స్టోరి కాంబో రిపీట్.. నాగచైతన్యతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సాయిపల్లవి
Saipallavi | కొన్ని సినిమాలు ఎనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి సినిమానే ‘ఎన్సీ23’. నాగచైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఇది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది.
Saipallavi | కొన్ని సినిమాలు ఎనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి సినిమానే ‘ఎన్సీ23’. నాగచైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఇది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది. ఇక అప్పట్నుంచీ ఈ సినిమా కథ గురించి, కథానాయిక గురించి చర్చోపర్చలు జరుగుతూనే వున్నాయి. 2018 నవంబర్ నెలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్య్సకారులు గుజరాత్‌లోని వీరవల్ వద్ద సముద్రంలో చేపలు పడుతూ పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్థాన్ సైనికులకు చిక్కి బందీలుగా మారారు.
వారు అనుభవించిన ఏడాదిన్నర జైలు జీవితం.. తద్వారా ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని విశ్వసనీయ సమాచారం. ఇందులో నాగచైతన్య మత్స్యకారునిగా నటించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలల్లో పర్యటించి అక్కడి మత్య్సకారులతో మమేకమై, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఇక ఇందులో కథానాయిక ఎవరు? అనేది చాలారోజులుగా నలుగుతున్న ప్రశ్న. దానికి బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసిన వీడియోతో తెరపడింది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.. ‘లవ్‌స్టోరీ’ తర్వాత మళ్లీ ఆమె నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

