Thandel Movie | నాగచైతన్య మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. NC23కు ‘తండేల్’ టైటిల్
Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాగా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్లోని వీరవల్కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా NC23 సినిమా రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
రేపు నాగ చైతన్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్లుక్తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు ‘తండేల్’(Thandel) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇక ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో పడవలో ఉండి శత్రువులతో పోరు చేస్తూన్నట్లు యాక్షన్ మోడ్లో కనిపించారు నాగ చైతన్య.
#NC23 is #Thandel
A character I’m really looking forward to playing .. and a team I’m really fond of @chandoomondeti, @Sai_Pallavi92, @ThisIsDSP and every one at @GeethaArts.Shoot begins soon 🙂
దుల్లకొట్టేదాం ✊🏽
జై దుర్గా భవాని🙏#AlluAravind #BunnyVas #Riyaz @ThisIsDSP… pic.twitter.com/Waeahc3Psa
— chaitanya akkineni (@chay_akkineni) November 22, 2023
యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కాగా ఈ మూవీ కోసం నాగ చైతన్య బాడీ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మూవీ కోసం చైతూ లుక్ మార్చి.. గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

