Naga Chaitanya | టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. 2021లో సమంతతో విడిపోయిన అనంతరం శోభితాతో ప్రేమలో పడ్డాడు చైతూ.. అయితే మూడు ఏండ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో పాటు శోభిత ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ డిసెంబర్లో అయిన లేదా వచ్చే ఏడాది అయిన ఈ జంట పెళ్లీ పీటలు ఎక్కబోతుంది.
అయితే శోభిత తన లైఫ్‌లోకి వచ్చే ముందే సమంత జ్ఞాపకాలను ముందే చెరిపివేస్తున్నాడు. ఇప్పటికే తన సోషల్ మీడియాలో సమంతతో ఉన్న ఫొటోలను డిలీట్ చేసిన నాగ చైతన్య.. తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లలో ఉన్న సమంత ఫొటోలను కూడా తొలగించినట్లు తెలుస్తుంది. సమంతతో కలిసి కార్ రేసింగ్‌లో పాల్గోన్న చైతన్య ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. అయితే ఆ ఫొటో ఇప్పుడు చైతూ టైంలైన్లో కనిపించట్లేదు. ఈ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. శోభితతో పెళ్లికి ముందే సమంతతో తనకి ఉన్న జ్ఞాపకాలను చైతన్య తొలగిస్తున్నట్లు సమాచారం. కాగా.. చైతూ డిలీట్ చేసిన సమంత ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samantha Naga Chaitanya
Naga Chaitanya