నాగచైతన్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా తాలూకు షూటింగ్ బుధవారం మొదలైంది. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారరు. ‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
భారతీయ మూలాలు, ఫాంటసీ అంశాలు కలబోసిన మిస్టిక్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో కథ సాగుతుందని, ఇందులో నాగచైతన్య హిస్టరీ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉంటుంది. షూటింగ్ మొదలైన సందర్భంగా హీరో నాగచైతన్య తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీల్ డి కున్హా, సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కార్తీక్ దండు.