Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 శనివారం ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వీకెండ్ అంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీతో హౌస్‌లోని వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ వారం కూడా కంటెస్టెంట్ల ఆటలోని మంచి, చెడు అంశాలను చర్చిస్తూ నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఎవరిని ప్రశంసించాలో, ఎవరిని మందలించాలో స్పష్టంగా చెప్పారు. మొదట కెప్టెన్‌గా సుమన్ శెట్టి పనితీరును నాగార్జున అభినందించారు. గేమ్‌లో నిజాయితీగా, ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నావని ప్రశంసించారు. ఆడియెన్స్ కూడా సుమన్‌పై మంచి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ మాటలు విన్న సుమన్ సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు.
సంజనా–మాధురి మధ్య జరిగిన గొడవను నాగార్జున ప్రస్తావించారు. వీడియో చూపించి సంజనా తప్పు స్పష్టంగా నిరూపించడంతో ఆమెపై కత్తిపోటు వేశారు. అయితే తనను నామినేట్ చేసినందుకే ఆగ్రహంతో అలా మాట్లాడానని సంజనా చెప్పడంతో నాగ్ మరింత కఠినంగా స్పందించారు. “కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో” అని సలహా ఇచ్చారు. తరువాత కిచెన్‌లో పప్పు విషయంలో తను చేసిన రూడ్ ప్రవర్తనకుగాను మరోసారి కత్తిపోటు వేశారు. రేషన్ టాస్క్ సమయంలో తనూజతో జరిగిన గొడవపై నాగార్జున కళ్యాణ్‌ను నిలదీశారు. ఎవరిపైనా ఆర్డర్ వేసే హక్కు లేదని, ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడాలని సూచించారు. ఫ్రెండ్స్ వచ్చాక గేమ్ మారిందని చెప్పారు.
భరణి సేఫ్ గేమ్ ఆడుతున్నాడని నాగ్ వ్యాఖ్యానించారు. “ఒకసారి ఎలిమినేట్ అయ్యి తిరిగి వచ్చిన నువ్వు మళ్లీ ఇలాగే ఆడితే ఫలితం తేలిపోతుంది” అంటూ వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్‌లో స్టాండ్ తీసుకోలేదని విమర్శించారు. ఎపిసోడ్లో అత్యంత సీరియస్ మూమెంట్ పవన్–రీతూ మధ్య గొడవ. రీతూతో దురుసుగా ప్రవర్తించిన పవన్‌పై నాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి ప్రవర్తన బిగ్ బాస్ హౌస్‌లో అంగీకారయోగ్యం కాదు” అంటూ గట్టిగా హెచ్చరించారు. పవన్‌ను హౌస్ నుంచి వెళ్లిపోమని ఆదేశించారు. చివరికి రీతూకు సారీ చెప్పించాడు నాగ్.
చివర్లో రాము కామెడీ క్లిప్స్ చూపిస్తూ హౌజ్‌ని ఆనందంలో ముంచెత్తాడు నాగార్జున. సాయి, గౌరవ్, నిఖిల్ గేమ్‌లో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. మొత్తానికి శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ప్రశంసలు అందుకోగా, సంజనా డబుల్ కత్తిపోటు తగిలించుకుంది. చివర్లో రాము కామెడీతో ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గా ముగిసింది.ఇక ఈ వారం హౌజ్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. గౌరవ్ బయటకు వెళ్లాడనే టాక్ గట్టిగా నడుస్తుంది.