స్వీయ దర్శకత్వంలో లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తున్న చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్ కథానాయిక. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా సాధికారత, ఆత్మగౌరవం అంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి ప్రేమకథతో మెప్పిస్తుంది. కథానుగుణంగా అందరూ కొత్తవాళ్లను తీసుకున్నాం.
ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులందరికి కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను అను అనే అమ్మాయి పాత్రను పోషించానని, ఆత్మగౌరవంతో బ్రతకాలని తపించే యువతిగా అందరిని మెప్పిస్తుందని కథానాయిక కావ్య రమేష్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మెజ్జో జోసెఫ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ చిన్నా.