మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘నారి’. ఆమని, వికాస్ విశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ ముఖ్య పాత్రధారులు. సూర్య వంటిపల్లి దర్శకుడు. శశి వంటిపల్లి నిర్మాత. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7 సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
అగ్ర నిర్మాత దిల్‌రాజు ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ‘ఓ మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపించాం. ఇలాంటి సినిమా చేసినందుకు దర్శకుడిగా గర్విస్తున్నా. ఇందులో ప్రధాన పాత్రగా ఆమని గారిని తప్ప మరొకరిని ఊహించలేం. అద్భుతంగా నటించారమె.’ అని దర్శకుడు చెప్పారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తుందీ సినిమా అని ఆమని తెలిపారు. మహిళల కోసం నిర్మించిన ఈ సినిమా సకుటుంబంగా చూసి ఆనందించేలా ఉంటుందని నిర్మాత శశి వంటిపల్లి చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.