తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న సినిమా ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మాతలు. వెంకట్ వందెల దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది.
దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ…‘పురాణాల్లో మనం పవిత్రప్రేమ ఎలా ఉంటుందో చదువుకున్నాం. అలాంటి పవిత్రప్రేమ కథ ఇది. మామూలు ప్రేమ కథల్లా అమ్మాయి, అబ్బాయి ఒకరి వెంట మరొకరు పడటం ఉండదు. ఒక అబ్బాయి తన ప్రేమ గురించి చెప్పుకునే సినిమా’ అన్నారు.