మోడ్రెన్ లుక్‌తో మురిపించినా, విలేజ్ లుక్‌లో మెరిపించినా.. ఎలా చూసినా.. ఎటునుంచి చూసినా నాగార్జున ైస్టెలే వేరు. ఆయన్ని వెండితెర మన్మథుడు అనేది అందుకే. నాగ్ ప్రస్తుతం ‘నా సామిరంగ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబోస్ రాయగా, ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు.
వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌పై కాలు వేసి, బీడీ కాలుస్తూ పక్కా మాస్‌గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు నాగ్. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. నాగార్జున కెరీర్లోనే ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారని, కథ, కథనాలు వాస్తవికతకు అద్దంపట్టేలా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కరుణకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణం చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ.