ఎత్తికెళ్లిపోవాలనిపిస్తుంది..
నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు చెందిన పాటను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.
నాగార్జున నటిస్తున్న పూర్తిస్థాయి మాస్ చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. ఆషికా రంగనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు చెందిన పాటను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ఎం.ఎం.కీరవాణి స్వరపరచగా, చంద్రబోస్ రాసిన ‘ఎత్తికెళ్లిపోవాలనిపిస్తుంది..’ అంటూ సాగే ఈ గీతం యువతరం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటతో ‘నా సామిరంగ’ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయని, ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్‌ల సంగీత సాహిత్యాలు ఈ సినిమాకు ప్రధానబలంగా నిలువనున్నాయని, ముఖ్యంగా ఈ పాటను రామ్ మిరియాల అద్భుతంగా ఆలపించాడని, నాగ్, కీరవాణి కాంబినేషన్లో గతంలో వచ్చిన ఆల్బమ్స్‌కి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ ఆల్బమ్ కూడా ఉండనుందని నిర్మాత చెప్పారు. ప్రమోషన్స్‌లో రగ్గ్డ్గా కనిపిస్తున్న నాగార్జున, ఈ పాటలో చాలా హ్యాండ్సమ్గా అలరిస్తారని, ఇక ఆషికా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంటుందని, ఈ పాట ఆడియన్స్‌కి విజువల్ ఫీస్టేనని దర్శకుడు చెప్పారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్. నిర్మాణం: శ్రీనివాస్ సిల్వర్‌స్క్రీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

