Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ ప్రోమో (naa ready song)ను లాంఛ్ చేశారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పాటను అనిరుధ్‌తో కలిసి పాడాడు దళపతి విజయ్.
లియోలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. లియోలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ భామ శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది లియో. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
నా రెడీ సాంగ్ ప్రోమో..
Neenga keta mass aana promo oda #NaaReady nanba 🔥
Let the celebrations begin 🥁▶️ https://t.co/MAn3s6G5DV#LEOFirstSingle from JUNE 22 💥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @Jagadishbliss @trishtrashers @duttsanjay @akarjunofficial @immasterdinesh…
— Seven Screen Studio (@7screenstudio) June 20, 2023
లియో టైటిల్ ప్రోమో..