
ఎస్పి హర్ష ప్రొడక్షన్స్ పతాకంపై శివ కొర్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘నా మనసంతా నువ్వే ప్రియా’ అజయ్ కౌండిన్య దర్శకుడు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. త్వరలోనే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి సమాజానికి విద్య, వ్యవసాయం చాలా ముఖ్యం. కానీ ఈతరం యువత విద్య, వ్యవసాయాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఒక అందమైన ప్రేమకథతో విద్య, వ్యవసాయం గురించి చెప్పే ఒక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతు