Comedian Ali Betting |నా అన్వేషణ పేరుతో ఎంతో మందికి దగ్గరైన యూట్యూబర్ అన్వేష్ ఈ మధ్య బెట్టింగ్ యాప్‌లపై పోరాడుతున్నాడు. అతను బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. లోకల్ బాయ్ నాని మొదలు.. ఇప్పుడు కమెడియన్ అలీ వరకూ వరుస వీడియోలు పెట్టి.. మిలియన్లలో వ్యూస్ రాబట్టారు అన్వేష్. తాజాగా ఆలీ గురించి ఓ వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియోలో కమెడియన్ అలీ.. తన భార్యతో కలిసి చేసిన ‘బిర్యానీ వీడియో’ వెనుక కోట్ల రూపాయల మోసం ఎలా జరిగిందో క్లియర్‌గా వివరించారు.
‘బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి దాదాపు వెయ్యి సినిమాల్లో నటించారు. 50 సినిమాల్లో హీరోగా కూడా చేశారు. అతనికి సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 1000 కోట్లు ఉంటుంది. అలాంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్‌ను ఎందుకు ప్రమోట్ చేశాడు, అంత మందిని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందని అన్వేష్ తన వీడియోలో సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మీలాంటి వేలకి పడగలెత్తిన వారు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడం ఏంటి సార్ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. బెట్టింగ్ యాప్‌ల వల్ల మీకు లాభం వస్తుందేమో కాని .. ప్రజలకు నష్టం జరిగింది.
మీరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన చాలా వీడియోలు డిలీట్ చేశారు. కానీ వాటిని చూసిన జనం ఇంకా మర్చిపోలేదు. రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా ఉండాలి.. కానీ మీరు రంజాన్ మాసంలో కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తుంటే అప్పుడు నేను మీకు మెసేజ్ చేశాను. ‘రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదని. దానికి మీరు.. ఏం కామెంట్ చేశారంటే.. ‘అల్లా ఎక్కడైనా చెప్పారా?’ అని అన్నారు. మీరు జనానికి సాయం చేయకపోయినా పర్లేదు కాని ఎవరికి హాని తలపెట్టొద్దు. బెట్టింగ్ యాప్స్ వలన మీకు లక్షల్లో ఆదాయం వస్తుంది కాని దాని వలన చాలా మంది చనిపోతున్నారు. మీ వలన నష్టపోయిన వారు చాలా మంది. రంజాన్ మాసంలో అలాంటి వారికి అయిన సాయం చేయండి. మీ సొంత డబ్బులు ఇవ్వమని అడగడం లేదు, బెట్టింగ్ యాప్‌ల వల్ల సంపాదించిన డబ్బునే తిరిగి వాళ్లకే ఇచ్చి పాపాన్ని కాస్త అయినా కడుక్కోండి సార్. అది పాపపు సొమ్ము.. రక్తపు కూడు సార్. బిర్యానిని బిర్యానీ చేసి ప్రజలకి పంచిపెట్టినట్టు చేసి దానికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో పెట్టారు. దాని ద్వారా బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారు. మీరు ఇంత దారుణానికి ఒడికట్టవచ్చా? బిర్యానీ ఇచ్చి మోసం చేసిన వాడిగా చరిత్రలో మిగిలిపోతారు అంటూ పెద్ద వీడియోనే విడుదల చేశాడు అన్వేష్.