RRR Promotions | టాలీవుడ్లో అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగశ్వర్రావు, కృష్ణం రాజు, శోభన్ బాబు వంటి హీరోలు ఏడాదికో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. ఇక 90ల నాటి నుంచి మల్టిస్టారర్లు చాలా వరకు తగ్గిపోయాయి. 20ల నుంచి అస్సలు మల్టీస్టారర్ సినిమాలు రావడమే అరుదుగా ఉండేవి. అయితే లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో మళ్ళీ మల్టీస్టారర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. కథ నచ్చితే స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ కలిసి ‘ట్రిపుల్ఆర్’ సినిమాలో నటించారు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
లేటెస్ట్గా జరిగిన ప్రెస్మీట్లో భాగంగా ఎన్టీఆర్‌తో..మీ తాత గారు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేసేవారు, మీ నుంచి కూడా ఇలాగే మల్టీస్టారర్ సినిమాలు ఎక్స్పర్ట్ చేయవచ్చా అని సినీ క్రిటిక్ అడుగగా దానికి బదులుగా ఎన్టీఆర్ ఖచ్చితంగా చేస్తాను. కథ బాగుంటే, ఆ కథను డైరెక్టర్ హ్యండిల్ చేయగలడు అనిపిస్తే తప్పకుండా చేస్తాను అంటూ వెల్లడించాడు. ఎవరితో మల్టీస్టారర్ సినిమా చేయాలనుకుంటున్నారు అనే దానికి.. అందరితో చేయాలనుకుంటున్నా. ప్రభాస్, బన్నీ, మహేష్‌బాబు, చిరంజీవి గారు, బాలకృష్ణ బాబాయి ఇలా అందరితో కలిసి చేయాలనుకుంటున్నా అంటూ వెల్లడించాడు. ఇక ‘ట్రిపుల్ఆర్’ చిత్రాన్ని అత్యంత భారీ సంఖ్యలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ఇండియాలో ట్రిపుల్ఆర్ చిత్రాన్ని విడుదల తేది కంటే ముందు రోజు అంటే 24న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.