‘ఓ పదిమంది కొండమీద ఉండే ఓ ప్లేస్‌కి వెళ్లారు. అది మూసేసిన పిచ్చాసుపత్రి అని తెలిసింది. బయటకు వచ్చి చూస్తే.. వాళ్ల కారు లేదు. మొబైల్స్‌లో సిగ్నల్స్ లేవు. ఆ టైమ్‌లో ఆండీ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. అతనొచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే ప్రశ్నకు సమధానమే మా ‘విరాజి’ అంటున్నారు దర్శకుడు ఆద్యంత్ హర్ష. ఆయన దర్శకత్వంలో వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘విరాజి’. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు ఆద్యంత్ హర్ష విలేకరులతో ముచ్చటించారు. ‘ ‘విరాజి’ అంటే చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగు చూపేవాడు అని అర్థం. శివుడు అని కూడా అర్థముంది. ఇందులో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలున్నా అండర్ కరెంట్‌గా సోషల్ ఎలిమెంట్స్ చూపిస్తున్నాం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఆ అంశాలు ప్రేక్షకుల్ని వెంటాడతాయ్.’ అని తెలిపారు ఆద్యంత్ హర్ష.
ఇంకా మాట్లాడుతూ ‘ ఈ కథను ముందు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్లకు చెప్పాను. తర్వాత వరుణ్‌సందేశ్‌కు చెప్పాను. ఫస్ట్‌హాఫ్ బావుందన్నాడు. సెకండాఫ్ విని గూజ్ బంప్స్ అన్నాడు. ప్రీప్రొడక్షన్కి ఆరు నెలలు కేటాయించాం. ప్రతిదీ ప్లాన్ చేసుకొని అనుకున్న బడ్జెట్‌తో సినిమా పూర్తి చేశాం. నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్‌కి కేటాయించాం. నటుడిగా వరుణ్సందేశ్ని మరోస్థాయిలో నిలబెట్టే సినిమా ఇది. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని ఆద్యంత్ హర్ష చెప్పారు.