తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టరీ’. స్వప్నచౌదరి కథానాయిక. వెంకట్ పులగం నిర్మాత. ఈ నెల 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
సినిమా కొత్తగా ఉంటుందని, టైటిల్‌కి తగ్గట్టే థ్రిల్లింగ్ అంశాలు మెండుగా ఉంటాయని సాయికృష్ణ చెప్పారు. ఇందులోని తన పాత్రలో ఆరు రకాల వేరియేషన్స్ ఉంటాయని ఉంటాయని కథానాయిక స్వప్న అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శివ కాకు, సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్.బి