Atlee | గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan)- శంకర్ (Shankar) కాంబోలో భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వన్ ఆఫ్ ది గెస్ట్‌గా హాజరయ్యాడు అట్లీ (Atlee) .
ఈ సందర్భంగా అట్లీ చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. నా కొడుకు భవిష్యత్తులో సినిమా అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కమల్ హాసన్ సార్ అన్ని సినిమాలు చూడాలి. ఆయన ఒక అబైబిల్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా అన్నాడు. అంతేకాదు నేను మీతో కలిసి పని చేయాలనుకుంటున్నా సార్.. ఏదో ఒక రోజు చేస్తా. స్క్రిప్ట్ రెడీ చేసిన మీ దగ్గరకు వస్తా సార్.. అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. ఇప్పటికే విజయ్, షారుఖ్‌ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ కాంపౌండ్ నుంచి కమల్ హాసన్‌తో సినిమా రాబోతుందని కన్ఫామ్ అవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్.
ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.