తన టాలెంట్‌తో తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మెయిన్ హీరోయిన్గా టాప్ ప్లేస్ దక్కించుకుంది పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా(Raashi Khanna). ఈ బ్యూటీ తొలిసారి అజయ్ దేవ్గన్ తో కలిసి ఓటీటీ ప్రాజెక్టు హిందీ వెబ్ సిరీస్ రుద్ర (Rudra The Edge of Darkness)లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి తెలియగానే తన కుటుంబసభ్యులు ఎలా స్పందించారో చెప్పింది రాశీఖన్నా. నువ్వు చాలా సిగ్గపడతావ్..మాట్లాడవు..నువ్వు ఎలా నటిస్తావు..? అని ఫ్యామిలీ మెంబర్స్ తనను అడిగారని చెప్పింది.
రుద్ర ట్రైలర్ (Rudra trailer) విడుదలవగానే అమ్మ షాకైంది. అలాంటి సరైన గుర్తింపు కోసమే నేను ఎదురుచూస్తున్నా. నా తల్లితండ్రులు, సోదరుడు ఎప్పుడూ నిరుత్సాహపరచరు..వాళ్లే నా బెస్ట్ సపోర్ట్ అని అన్నది. రుద్ర..ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ సీజన్ 1 ఆరు ఎపిసోడ్స్ తో డిస్నీ+హాట్ స్టార్ లో మార్చి 4న విడుదలైంది. స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ఇండియావైడ్‌గా మంచి పాపులారిటీ సంపాదించింది. మరి రాశీఖన్నాకు కూడా రుద్ర మంచి గుర్తింపునిస్తుందని ఆశిస్తున్నారు సినీ జనాలు.
రాశీఖన్నా ప్రస్తుతం మారుతి-గోపీచంద్ కాంబోలో వస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తోంది. నాగచైతన్యతో విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న థాంక్యూ చేస్తోంది.