Ilaiyaraaja | మంజుమ్మెల్ బాయ్స్ మేకర్స్‌కు ఇళయరాజా లీగల్ నోటీసులు
Ilaiyaraaja | ఈ ఏడాది మాలీవుడ్ నుంచి విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). విడుదలైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. మాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచి అరుదైన ఫీట్ నమోదు చేసింది.
Ilaiyaraaja | ఈ ఏడాది మాలీవుడ్ నుంచి విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). చిదంబరం డైరెక్షన్లో సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. మాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచి అరుదైన ఫీట్ నమోదు చేసింది.
మంజుమ్మెల్ బాయ్స్ లో ఇళయరాజా (Ilaiyaraaja) కంపోజ్ చేసిన కమల్ హాసన్ క్లాసిక్ సినిమా గుణలోని.. కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అంటూ సాగే పాట, మ్యూజిక్‌ను వాడారని తెలిసిందే. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్, క్లైమాక్స్‌లో వాడిన పాటకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే దీనిపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు.
తన క్రియేటివ్ వర్క్ (పాట, సంగీతం)ను అసందర్భోచితంగా వినియోగించినందుకు నష్టపరిహారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సాంగ్ విషయంలో మేకర్స్ ముందుగానే గుణ మూవీ ఆడియో హక్కులు కలిగిన మ్యూజిక్ లేబుల్ నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ నోటీసులు పంపించడం గమనార్హం. మరి ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ టీం ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

