Thaman S | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ కరోనా బారిన పడ్డారు. డాక్టర్ల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నానని తమన్ ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని తమన్ సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. హీరో మహేష్ బాబు, విశ్వక్ సేన్, లక్ష్మీ మంచు తదితరులు కోవిడ్ బారిన పడ్డారు. అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు.
God bless ❤️ pic.twitter.com/b7a5CCnYbv
— thaman S (@MusicThaman) January 7, 2022