కేజీఎఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘వీర చంద్రహాస’. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వేగర్, గుణశ్రీ ఎం.నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎన్.ఎస్.రాజ్‌కుమార్ నిర్మాత. ఈ నెల 18న కన్నడంలో విడుదలైన ఈ సినిమా అఖండవిజయం సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. కంచి కామాక్షి-కోల్‌కతా కాళి క్రియేషన్స్ పతాకంపై ఎం.వి.రాధాకృష్ణ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనీ, ‘వీర చంద్రహాస్’ అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా అనీ, తెలుగులో తప్పక విజయం సాధిస్తుందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత ఎం.వి.రాధాకృష్ణ తెలిపారు.