మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల స్వీయ దర్శకత్వంలో నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
మనీ ట్రాన్సాక్షన్లో జరిగిన మిస్టేక్ వల్ల హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్ ఏర్పడటం ఈ టీజర్లో ఆసక్తికరమైన అంశం. హీరో విక్కీ తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్‌లో సక్సెస్ అయ్యాడా? హీరోయిన్ ప్రేమను విక్కీ ఎందుకు వద్దనుకున్నాడు? తన తండ్రికి సంబంధించి విక్కీకి ఉన్న గతమేంటి?
ఈ ప్రశ్నలతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ టీజర్ సాగింది. ఆనంద్ భారతి, రాకేష్ మాస్టర్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: శివప్రసాద్, నిర్మాణం: వేలార్ ఎంటర్టైన్మెంట్స్.