Mumbai Diaries season 2 | 2021లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ముంబై డైరీస్ 26/11 (Mumbai Diaries 26/11) వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్ 26, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను కట్టి పడేసింది. కొంకణా సేన్ శర్మ, మోహిత్ రైనా, టీనా దేశాయ్ ప్రధాన పాత్రలు పోషించగా.. డి-డే, బాట్లా హౌస్ చిత్రాల ఫేమ్ నిఖిల్ అద్వానీ ఈ వెబ్ సిరీస్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ సీజన్ 2 వస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ సీజన్ 2కు సంబంధించి రీసెంట్గా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ నుంచి మేకర్స్ ట్రైలర్ వదిలారు.
మొదటీ సీజన్ 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఉండగా.. రెండో సీజన్ ముంబై వరదల నేపథ్యంలో రానున్నట్లు తెలుస్తుంది. వరదల్లో ముంబై నగరం చిక్కుకోగా.. బాంబే జనరల్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్యం చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. వారి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్లను రక్షించేందుకు కష్టపడుతుంటారు. ఈ కథాంశంతోనే ముంబై డైరీస్ సీజన్ 2 రూపొందింది. ఇక ఈ సీజన్ 2 అక్టోబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
As an incessant storm submerges the city ⛈️, Dr Kaushik is the only messiah for the stranded patients
🥼.Can he save the victims stuck in Bombay General Hospital 🏥 ?
Watch the new season of Mumbai Diaries from October 6 to find out! pic.twitter.com/Zke0kx1r11
— prime video IN (@PrimeVideoIN) September 30, 2023
ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ సిరీస్‌ను మోనిషా అద్వానీ & మధు భోజ్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సీజన్లో కొంకణా సేన్ శర్మ, మోహిత్ రైనాలతో పాటు శ్రేయా ధన్వంతరి, నటాషా భరద్వాజ్, సత్యజీత్ దూబే, మృణ్మయీ దేశ్‌పాండే, ప్రకాష్ బెలవాడి, పరంబ్రత ఛటోపాధ్యాయ, రిధి డోగ్రా, బాలాజీ గౌరీ, సోనాలి కులకర్ణి నటించనున్నారు.