Bigg Boss OTT Telugu | బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రారంభం అయింది. ఇప్పటికే ఇద్దరు వారియర్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అషు రెడ్డి మొదటి వారియర్‌గా, రెండో వారియర్‌గా మహేశ్ విట్టా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు.
ఇక మూడో వారియర్‌గా బిగ్ బాస్ వన్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ మొదటి సీజన్లో ముమైత్ ఒకసారి బయటికి వెళ్లి మరీ హౌస్‌లోకి తిరిగి వచ్చింది. తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. తిరిగి ఇప్పుడు ఓటీటీ సీజన్‌కు మూడో వారియర్‌గా ముమైత్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో తాను డైనమైట్‌గా ఉంటానంటూ చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్.