Director Venu Muralidhar | విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముఖ్య గమనిక’. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందంటున్నారు.
కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మా సినిమా నిరూపించింది. కొన్ని ఏరియాల్లో థియేటర్లను పెంచబోతున్నాం. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అన్నారు. తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి ప్రేక్షకుల చక్కటి ఆదరణ కనబరుస్తున్నారని, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఓ సినిమాను తెరకెక్కిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.