Ms Shetty Mr Polishetty Release Date | ‘జాతిరత్నాలు’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఇంకా ఇప్పటివరకు తన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే రొమ్-కామ్ సినిమా చేస్తున్నాడు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. పైగా దానికి తోడు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా సినీ లవర్స్ నిరీక్షణకు ఫలితం దక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్‌కు జోడీగా అనుష్క నటిస్తుంది. యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.