Ms Shetty Mr Polishetty Teaser | మూడేళ్ల కిందట వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా నవీన్ కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్ అయింది. టాలీవుడ్లో ఆయన తిరుగులేని క్రేజ్‌ను, మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే రొమ్-కామ్ సినిమా చేస్తున్నాడు. మహేష్‌బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. పైగా దానికి తోడు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే అప్పుడెప్పుడో టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసన తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు.
కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌తోనే సినిమాపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మేకర్స్. ఒక చెఫ్‌కు, స్టాండప్ కమెడియన్‌కు మధ్య సాగే కథ ఇదని ముందు నుంచి మేకర్స్ చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక టీజర్లో కూడా అదే చూపించారు. అయితే జీవితంలో పెళ్లి వద్దనుకునే అనుష్క, నవీన్‌తో ఎలా ప్రేమలో పడింది? వాళ్ల ప్రేమ పెళ్ళి వరకు సాగుతుందా? స్టాండప్ కమెడియన్‌గా రాణించాలనుకునే నవీన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలా ఎన్నో అంశాలకు ఈ టీజర్ తెరలేపింది.
అయితే టీజర్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మంచి లవ్ ఎంటర్టైనర్ సినిమా చూస్తున్నామనే ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకుంటుంది. ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సీన్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు టీజర్‌తో స్పష్టం అయింది. యూవీ సంస్థ కూడా ఈ సినిమాను చాలా రిచ్‌గా తీసినట్లు విజువల్స్ చూస్తే తెలుస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.