Jovika Vijay Kumar | ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. హారర్ జానర్లో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమా ద్వారా తమిళ నటి వనితా విజయ్ కుమార్ కుమార్తె జోవిక విజయ్ కుమార్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. చిత్రంలో ఆమె ‘హరిణి’ అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తుండగా, దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఆమెను ఒక తీవ్రమైన శక్తిగా అభివర్ణించారు మేకర్స్.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రావణ్ రెడ్డి ‘సింహ’గా, కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’గా నటిస్తుండగా, ఉల్కా గుప్తా, షిజు అబ్దుల్ రషీద్ వంటి తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సుమారు 45 నిమిషాల పాటు సాగే భారీ వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతాన్ని అందిస్తుండగా, నాని చమిడిశెట్టి ఛాయాగ్రహణం, జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ మరియు రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
From the world of #Agadha comes a fierce force ❤️🔥
Presenting the incredibly talented #JovikaVijayKumar as Harini..
Written & Directed by @MSRajuOfficial 🎬@SAVProductions_ @bhaskarla_sai @shravanreddy7_ @Ulka12official #ShijuAbdulRasheed #RoshanBasheer #ShreyaRaniReddy… pic.twitter.com/HMORsA14ZB
— BA Raju’s Team (@baraju_SuperHit) April 30, 2026